3 - అథ కూర్మావతార వర్ణనమ్.

అగ్ని రువాచః-

అగ్ని పలికెను: పాపములను తొలగించు కూర్మావతారమునుగూర్చి మొదట నేను ప్రతిజ్ఞ చేసినవిధమున చెప్పెదను. పూర్వము దేవాసుర యుద్దములో దేవతలు దూర్వాసుని శాపము చే దైత్యుల చేతిలో ఓడిపోయిరి. అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీరహితులై పోయిరి. క్షీరాబ్ది పై ఉన్న విష్ణువును స్తుతించి “మమ్ము లను అసురులనుండి రక్షింపుము” అని వేడికొనిరి.

శ్రీమహావిష్ణువు బ్రహ్మాది దేవతలతో ఇట్లనెను: “సురలారా! క్షీరాబ్దిని మథించి అమృతమును లక్ష్మిని సంపాదించు టకే అసురులతో సంధి చేసికొనుడు. పని వడి నపుడు శత్రువులతో కూడ సంధి చేసి కొనవలెను గదా ! అమృతము మీకే తక్కునట్లును, దానవులకు తకకుండు నట్లును చేసెదను. మందర పర్వతమును కవ్వముగ చేసి, వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి, నా సాహాయ్యముతో క్షీరాబ్దిని మథింపుడు. మాంద్యము వలదు.

విష్ణువు ఇట్లు పలుకగా దేవతలు దైత్యులతో ఒప్పందము చేసికొని క్షీరాబ్దికి వచ్చి, మథింప ప్రారంభించిరి. వాసుకి తోక వైపు దేవత లుండిరి .

            సర్పము విడచు నిట్టూర్పుల వేడికి బాధపడుచున్న దేవతలను హరి. సేదదీర్చెను. సముద్రమును మథించు చుండగా ఆ పర్వతము క్రింద ఆధార మేదియు లేకపోవుటచే నీటిలో మునిగిపోయెను.

విష్ణువు కూర్మరూపమును ధరించి మందరపర్వతమును నిలబెట్టెను. మథింపబడుచున్న క్షీరాబ్దినుండి హాలాహల విషము పుట్టెను.

            శివుడు ఆ విషమును కంఠమునందు ధరిం చెను. అందుచే అతడు నీలకంఠు డయ్యెను. పిమ్మట వారుణీదేవియు (సురయు), పారిజాతము కౌస్తుభము, గోవులు, దివ్యలగు అప్సరసలు పుట్టిరి. లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును చేరినది. దేవత లందరును ఆమెను చూచుచు స్తోత్రము చేయుటచే శ్రీమంతు లైరి.

పిమ్మట ఆయుర్వేదమును ప్రచారములోనికి తీసికొని వచ్చిన ధన్వంతరి రూపుడైన విష్ణువు అమృతపూర్ణ మగు కమండలువును చేత ధరించి ఆవిర్భవించెను.

జంతుడు మొదలగు దైత్యులు ఆతని చేతినుండి అమృతమును గ్రహించి,  సగము దేవతల కిచ్చి, వెళ్లి పోయిరి. పిమ్మట విష్ణువు శ్రీరూపమును ధరించెను.

మంచి సౌందర్యము గల ఆమెను చూచిన దైత్యులు మోహము చేది, “ఓ వరాననా ! మాకు భార్యవు కమ్ము; ఈ అమృతమును తీసికొని మాకు త్రాగించుము ) వంచి పెట్టుము” అని పలికిరి.

అట్లే అని పలికి హరి వారి చేతినుండి అమృతమును గ్రహించి దేవతలచే త్రాగించెను, రాహువు చంద్రరూపమును ధరించి అమృతము త్రాగుచుండగా సూర్యచంద్రులాతనిని పట్టి చూపిరి.

ఆప్పుడు విష్ణువు రాహుశిరస్సును చక్రముచే ఖండించి వేరు చేసి దయతో దానికి మరణము లేకుండునట్లు చే నేను, రాహువు వరము నిచ్చు హరితో ఇట్లు పలికెను : “చంద్రసూర్యులు నాచే పట్టుబడుచుందురు. అది గ్రహణ మగును. ఆ కాలమునందు ఇచ్చు దానము అక్షయ మగుగాక”.

“అటులనే అగుగాక అని విష్ణువు అతనితో పలికెను. పిమ్మట రూపమును త్యజించి దేవతలతో కలిసి యుండగా శివుడు “ఆ స్త్రీ రూపమును చూపుము” ఆని హరితో అనెను.

భగవంతుడైన శ్రీమహావిష్ణువు రుద్రునకు శ్రీ రూపముమ చూ పెను, శివుడు విష్ణుమాయచే మోహితుడై పార్వతిని విడచి ఆస్త్రీని వెంబడించెను.

             శివుడు ఉన్మత్తుడై, దిగంబరు డై ఆమె కేశపాశమును పట్టుకొనెను. ఆమె జుట్టు విడిపించుకొని వెళ్లి పోయెను ఇతడు ఆమె వెంట పరుగేత్తెను.

ఈశ్వరుని వీర్యము సలితమై భూమి పై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్ర మయ్యెను.

ఇది యంతయు మాయ యని గ్రహించి శివుడు స్వస్థచిత్తు డాయెను. ఆపుడు విష్ణువు శివునితో ఇట్లనెను : “రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈ లోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింపజాలరు.”

అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్దములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి. దైత్యులు పాతాళలోక నివాసు లయిరి. ఈ దేవి విజయకథను పఠించువాడు స్వర్గమును పొందును

ఆగ్నేయ మహా పురాణములో కూర్మావతార మనెడు తృతీయాధ్యాయము నమాప్తము.