6 - అథ అయోధ్యాకాణ్డవర్ణనమ్.

భరతుడు మాతుల గృహమునకు వెళ్ళిన పిమ్మట రాముడు తడ్రి మొదలగు వారిని భక్తితో సేవించెను, దశరథమహారాజు రామునితో ఇట్లనెను – “రామా ! వినుము”.

            “నీ గుణములందు ప్రేమచే ప్రజలు నిన్ను ఇంతకు పూర్వమే, మనసా। రాజ్యాభిషిక్తుని, చేసినారు; నేను రేపు ప్రాతఃకాలమున నీకు, యౌవరాజ్యము ఇచ్చుచున్నాను, సీతా సహితుడవై ఈ రాత్రి నీవు వ్రతమును అవలంబింపుము” వసిష్ఠుడు, సృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్ధనుడు, ఆశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, అను ఎనమండుగురు మంత్రులును రామునితో ఆ విధముగనే పలికిరి.

రాముడు తండ్రి మొదలైన వారి మాటలు విని, ఆన్లై చేసెదను అని చెప్పి, కౌసల్యకు కూడ తెలిపి, దేవతలను పూజించి, వ్రతము నవలంబించెను.

దశరథుడు “రాముని పట్టాభిషేక మునకు కావలసిన సంభారము లన్నియు నమకూర్చుడు” అని వసిష్టాదులతో చెప్పి కైకేయి వద్దకు వెళ్ళెను.

కైకేయికి సఖురా లగు మంథర ఆయోధ్యానగరమును అలంకరించుటను చూచి, రామునకు పట్టాభి షేకము జరుగనున్నదన్న విషయమును తెలిసికొని, దానిని కైకేయికి చెప్పెను.

ఒకప్పుడు ఆమె ఏదియో అపరాధము చేయగా రాముడు ఆమెను పాదములు పట్టి ఈడ్పించెను. ఆ వైరమును పురస్కరించుకొని ఆమె అతనిని వనమునకు పంపవలె నని అనుకొనెను.

ఓ! కై కేయీ ! లెమ్ము. రామునకు రాజ్యాభిషేక మనగా నీకును, నాకును, నీ కుమారునకును మరణమే, ఇందులో సందేహము లేదు.

కైకేయి ఆ కుబ్జ పలికిన మాటలు విని ఒక ఆభరణమును బహూకరించి ఇట్లు పలికెను. నాకు భరత డెంతయో రాముడు కూడ అంతయే. కాని భరతునికి రాజ్యము లభించు ఉపాయ మేదియు కానరాకున్నది. మంథర ఆ మాటలకు కోపించి ఆమె ఇచ్చిన హారమును గ్రహింపక కైకేయితో ఇట్లనెను.

మంథర వలికెను - “ఓ తెలివితక్కు వదానా ! భరతుని, నిన్ను, నన్ను కూడ రామునినుండి రక్షించును. “ రాముడు రాజు కాగలడు. అతని పిమ్మట ఆతని కుమారుడు రాజు కాగలడు. ఈ విధముగా భరతుడు రాజవంశమును కోల్పోవును. పూర్వము దేవాసుర యుద్ధమునందు శంబరుడు దేవతలను సంహరించెను. ఆ రాత్రి అవటానున్న నీ భర్తను నీవు విద్యా ప్రభావముచే రక్షించితివి. ఆపు డాతడు రెండు వరముల నిచ్చెను. ఇపుడు ఆ రెండు వరములను కోరుము. ఒక వరముచే, పదునాలుగు సంవత్సరములు రాముడు వనములో నివసింపవలె ననియు, రెండవ వరముచే భరతునికి యావరాజ్యమీయవలె ననియు కోరుము. అతడు దానినీయగలడు.

ఈ విధముగ ఆ కుబ్జచే ప్రోత్సహింపబడిన కైకేయి, అనర్గమును లాభకరమని భావించినదై “ఈ మంచి ఉపాయము దశరథుని చేత ఆ పని చేయించునా” అని పలికి కోప గృహమును ప్రవేశించి, మూర్ఛితురాలు  వలే భూమి పై పడి యుండెను.

రాజా బ్రాహ్మణులను పూజించి, కోపించి ఉన్న కైకేయిని చూచి ఇట్లు పలికెను. “ఇట్లున్నా వేసి  రోగముతో బాధపడుచున్నావా ? భయపడినావా ! నీ కేమి కావలెను. చెప్పుము, ఆది చేసెదను. “ఏ రాముడు లేకున్న చో ముహూర్ర కాల మైనను జీవింపజాలనో ఆ రాముని పై ఒట్టు పెట్టుచున్నాను. ఓ సుందరీ  నీ కోరికను నెరవేర్చెదను.”

ఆమె పలికెను. “ఓ రాజా ! నత్యము పలుకుము. నీవు ఇచ్చుటకు అంగీకరించేద వేని పూర్వము నా కిచ్చిన రెండు వరములను, సత్యమును పాలించుచు నాకిమ్ము, రాముడు పదునాలుగు సంవత్సరములు నియమవంతుడై వనము నందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంభారములతో, భరతుని రాజ్యాభిషి కుని చేయవలెను. ఈ వరముల నీయకున్న చో విషము త్రాగి మరణించెదము.

ఆ మాట విని, మూర్ఛితుడై , వజ్రముచే కొట్టబడినవాడు వలె భూమి పై పడెను. ముహూర్త కాలమున స్మృతి చెంది కై కేయితో ఇట్లనెను.

ఓ పాపనిశ్చయవంతురాలా ! నీకు రాముడు ఏమి అపకారము చేసినాడు ? నేనేమి చేసినాను  నకల ప్రపంచకమునకును, ఆప్రియమును ఆచరించుచు నీవు ఇట్లేల పలుకుచున్నావు ? కాలరాత్రి వంటి భార్య వైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడ నగుదును, భరతుడు. ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యమునకు వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవవై రాజ్యము నేలికొనుము.

సత్యపాశముచే బద్దుడైన ఆతడు రాముని పిలచి ఇట్లు పలికెను. “రామా ! నేను కె కేయిచే వంభింవ బడితిని. నన్ను బంధించి రాజ్య మేలుము. నీవు వనములో నివసింపవలెను. కైకేయీ కుమార డైన భరతుడు రాజు అగును.”

రాముడు తండ్రికిని, కైకేయికిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, కౌనలలకు నమస్కరించి, ఓదార్చి, సీతాలక్ష్మణసమేతుడై, బ్రాహ్మణులకును, దీనులకును, అనాధులకును దానములు చేసి, సుమంత్రునితో కూడినవాడై, రథము నెక్కి శోకార్తలైన తల్లులతోను, బ్రాహ్మణాదులతోను కూడి పట్టణమునుండి బయలు వెడలేను.

రాత్రి తమసా తీరమున నివసించి, పౌరులను విడచి వెళ్ళిపోయెను. ఆ పౌరులు ప్రాతఃకాలమున రాముని గానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి.

మిక్కిలి దుఃఖితు డైన దశరథమహారాజు ఏడ్చుచు కౌనల్యాగృహమునకు వెళ్ళెను. పౌరులును, స్త్రీలును, రాజస్త్రీలును ఏడ్చిరి.

నారచీరలను ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా ఆచ్చట గుహుడు ఆతనిని పూజించెను. అచట రాముడు ఇంగుదీవృక్షమూలమున నివసించెను.

లక్ష్మణుడును, గుహుడును ఆ రాత్రి యంతయు మేల్కొనియే యుండిరి. పిదప, సీతారామలక్ష్మణులు ప్రాతః కాలమున నావచే జాహ్న విని దాటి ప్రయాగ చేరిరి. భరద్వాజుని నమస్కరించి చిత్రకూటపర్వతము చేరిరి.

పిమ్మట వాస్తుపూజ చేసి, మన్దాకినీ నదీ తీరమున నివసించిరి. రాముడు సీతకు చిత్రకూటవర్వతమును చూపెను.

గోళ్ళచే సీతను గీరిన కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచినను శరణుజొచినది.

రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. నేను కౌమారవయస్సులో ఉన్నప్పుడు సరయూ తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము జేయు చున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్దవేధిని ఉపయోగించి చంపితిని. ఆతని తల్లిదండ్రులు చాల విలపించిరి. ఆతని తండ్రి “మే మిరువురము పుత్ర శోకముతో మరణించుచున్నాము. నీవు కూడ పుత్రశోకములో పుత్రుని స్మరేంచుచు మరణించెదవు” అని నన్ను శపించెను. కౌసల్యా ! నాకి విధముగ, మరణము. రానున్నది.” ఈ విధముగ కథను చెప్పి హా రామా! అని అనుచు రాజు స్వర్గము పొందేను. రాజు స్వర్గము పొందెను.

అతడు శోకపీడితుడై నిద్రించినా డని తలచి కౌనల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధబందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినాడని గ్రహించి కౌసల్య “అయ్యో! చచ్చితిని” అనుచు ఏడ్చెను.

పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి. వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా అయోధ్యకు రప్పించిరి.

శోకముతో నిండిన ఆ నగరిని చూచి, దుఃఖితుడై, భరతుడు “ఆపకీర్తి వచ్చి నెత్తి మీద పడినది కదా” అని కైకేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె, తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూనదీ తీరమున సంస్కారము చేసెను. “రాజ్యము చేయుము” అని వసిష్టాదులు పలుకగా ఇట్లనెను.

రాముని తీసికొని వచ్చుటకు వెళ్లేదను, బలశాలియైన రాముడే అందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు. శృంగి చేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగవేళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరెను. “రామా! మన తండ్రిగారు న్వర్గస్తులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. నేను నీ ఆదేశమును ఎదురు చూచుచు వనమునకు వెళ్లేదను” అని పలికెను. రాముడా మాటలు విని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ఇట్లనెను. “నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. 'సత్యపాలనమున కై జటలను నార చీరలును ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.” రాముడు ఈ విధముగా పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నందిగ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించేను.

ఆగ్ని మహాపురాణములో రామాయణకథలోని అయోధ్యాకాండ వర్ణనమను షష్ఠాధ్యాయము నమాప్తము.