ఇంకొక అగ్ని పురాణం
ప్రస్తుతము లభ్యమగుచున్న అగ్నిపురాణము అష్టాదశ పురాణకోటిలోని అగ్ని పురాణము కాదనియు వహ్నిపురాణమను పేరవ్రాత ప్రతులలోనే లభ్యములగుచున్న పురాణమనే మూలఅగ్ని పురాణముగా పురాణ పరిశోధనలో దిట్ట అయిన హజ్రా మహాశయుడు తెలుపుతున్నాడు. దీనికిని, ప్రస్తుతము ముద్రితమైన అగ్నిపురాణమునకును ఏమాత్రము సంబంధమే లేదు. వహ్ని పురాణము ప్రస్తుత అగ్నిపురాణమునకు మూలమని అది క్రీ.శ. 4వ శతాబ్దికి పూర్వమే రచింపబడినదని అందులోని విషయాలను గ్రహించి అనేక శాస్త్రీయ విషయములు సంగ్రహించి ప్రస్తుత అగ్ని పురాణము రచింపబడిందని ప్రఖ్యాత సంస్కృత విద్వాంసులు శ్రీ పి. రామచంద్రుడుగారి ఉద్దేశ్యము. ప్రధానమైన విద్యలను సర్వజనయోగ్యం చేయడం ఈ పురాణ ప్రధాన ధ్యేయం. భోజుని సరస్వతీ కంఠాభరణము ఈ పురాణమునందలి అలంకార విషయము ఆధారముగా రచింపబడినది అని విజ్ఞుల భావన.
అగ్నిపురాణం ప్రతిపాదించిన అనేక తాంత్రిక ఆచారములలో విశిష్టమైనవి కొన్ని ఈ నాటికి వంగదేశమున ప్రచారమున గలవు. అందుచే ఈ పురాణం ఆ దేశములోని పశ్చిమ ప్రాంతంలో రచింపబడినదై ఉండవలెను. ఈ పురాణమునకు చివర
నా స్మాత్ పరతరం భూమౌ విద్యతే వస్తు దుర్లభమ్
ఆగ్నే యేహిపురాణేఽస్మిన్ సర్వా విద్యా ప్రదర్శితాః
ఇందు చెప్పబడని విషయము ఈ భూమియందు దుర్లభము. ఈ ఆగ్నేయ పురాణము నందు సర్వవిద్యలు ప్రదర్శింపబడినవి అనుట యందు ఆవంతయు అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం లభ్యం అవుతున్న అగ్నిపురాణం, కొందరు పండితుల వద్ద ఉన్న వహ్ని పురాణం రెండు గ్రంథాలలోను విషయానుక్రమణికలో కొంత సమానత ఉన్నది. బల్లాల సేనుడు తన దానసాగరంలో అగ్నిపురాణంలోనివని ఉదాహరించిన శ్లోకాలు ప్రస్తుత అగ్నిపురాణంలో లేవు.
అగ్ని, ఆగ్నేయ
మృషా వంశానుచారతైః కోశవ్యకరణాదిభిః
అసంగత కథా బంధ పరస్పర విరోధితః
త స్మీనకేత నాదీనాం భండ పాషండ లింగినామ్
లోక వంచ నమాలోక్యసర్వమేవా బధీరితమ్
అని చెప్పుటచే బల్లాలసేనుడు దీనిని ప్రామాణికముగా తీసుకొనలేదని చెప్పవచ్చును. ఇందులో దీక్షావిధి; రత్న పరీక్షణ, కోశ వ్యాకరణాది విషయములుగలవు. ఇవియే ఈ పురాణము యొక్క ప్రాచీనతకు ప్రతి బంధకములు ఈ విషయములను పరిశీలించినపుడు ఈ అగ్నిపురాణమే ప్రాచుర్యమునకు వచ్చి అసలు మూలరూపమైన అగ్ని పురాణము ఎందులకు మూలబడినదను అనుమానము రావచ్చును. ఈ పురాణము నందు చెప్పబడిన అనేక లౌకిక విషయములు ఉండుటయే ఈ పురాణము ప్రచుర ప్రచారము నందుటలోని రహస్యము. తంత్ర, ఆరాధన, గృహ సంబంధ విద్యలు ఇందు ఉండుటచే ఇది ఎంతో ప్రాచుర్యము పొంది పలువురిచేత పురాణముగా స్వీకరింపబడి, వహ్ని పురాణము అను ప్రాచీన పురాణము ప్రచారము నుండి తొలగిపోయి ఉండవచ్చును. మూల అగ్నిపురాణమందు తాంత్రిక వ్యావహారిక విషయములు ప్రదానముగా ఉండుటచే దాని ప్రచారము క్రమముగా క్షీణించి కేవలము వ్రాతప్రతిగా మాత్రము అచ్చటచ్చట దొరుకుచున్నది. వహ్ని లేక అగ్ని పురాణము నుంచి ఉద్దరించబడిన గ్రంథ భాగములు ప్రచారములోనున్న ప్రస్తుత అగ్నిపురాణము నందు దొరుకుట లేదు. కానీ ప్రాచీన వహ్ని పురాణమున మాత్రము గలవు. ఈ వహ్ని పురాణమందలి చాలా శ్లోకములు అగ్ని పురాణమునందును గలవు. అందుచే వహ్నిపురాణమును గూర్చియు కొంత సందేహము కలుగవచ్చును. వహ్ని లేక అగ్ని పురాణముల లోనివని మత్స్య పురాణము (58 / 28-30), స్కాందపురాణ ప్రభాస ఖండము (2/47-48)లలో చెప్పబడిన విషయములు రెండింటి యందును (అగ్ని, వహ్ని పురాణములలో) లేవు. అందుచే పై మత్స్య, స్కాంద పురాణమున చెప్పబడిన అంశము కలిగిన వేరొక అగ్ని పురాణము ఉండి ఉండుటకు అవకాశముగలదు. ప్రస్తుత అగ్నిపురాణము నందు దాదాపు 12 వేలశ్లోకములు గలవు. వహ్ని పురాణమును అనుసరించుచు ప్రత్యేక విషయములను చేర్చుచు సాగించిన రూపము ఇదే కావచ్చును. వహ్నిపురాణము క్రీ.శ. నాలుగు, ఐదు శతాబ్దులలో రచింపబడి ఉండునని చెప్పవచ్చును. వహ్ని పురాణ సంకలనములందు మూడు విభాగములు కన్పించు చున్నవి. మొదటిది యజుర్వేదీయ అగ్న్యౌరాధక బ్రాహ్మణులు రచించినది, రెండవది అగ్ని ఉక్త, వహ్ని పురాణము మొదలైన పేర్లుతో చెప్పబడినవి. ఈ అన్ని పేర్లు ఏకార్థక వాచకములే అందువలన ఒక పురాణమునకే ఇవి వేరువేరు పేర్లు కావలయును. గరుడ, గారుడ తార్క్ష్య, వైనతేయ పురాణములు అనునవి గరుడ పురాణమునకు, విష్ణు, వైష్ణవ ములను పేర్లు విష్ణు పురాణమునకు ఇట్లే వేర్వేరు పేర్లుగలవు. కానీ వహ్ని పురాణమును వేరొక వ్రాతప్రతి లభించుచున్నది. పురాణములను గుఱించి ప్రామాణిక పరిశోధనలనుచేసిన డా!! హజ్రా ఈవహ్నిపురాణమే అసలు(మూల) అగ్నిపురాణముగా నిర్ణయించిరి. దీనిని గుఱించివారు బరోడా జర్నల్ 5వ సంచికయందు నాల్గవ అంకమున, ‘అవర్ హెరిటేజ్’ పత్రిక యొక్క ప్రథమ, ద్వితీయ అంకములందు విస్తృతమైన చర్చగావించిరి. ఈ వహ్నిపురాణ వ్రాత ప్రతి శ్రీ హజ్రా వద్దగలదు. వారు ఉటంకించిన విషయముల ప్రకారము ప్రాచీన పండితులు అగ్ని పురాణము నుంచి ఉదాహరించిన విషయములు అన్నియు ఈ వహ్నిపురాణమునందు లభ్యమగుచున్నవని తెలిపిరి. స్వభావతః ఈ అగ్ని పురాణము అగ్ని-పాంచరాత్రుల ద్వారా సంస్కరించబడిన వైష్ణవపూజ ప్రాధాన్యతను వివరించు తంత్ర ప్రధానపురాణము. ఏ ప్రమాణములతో డా!! హజ్ర వహ్ని పురాణమును మూల అగ్నిపురాణముగా నిరూపించిరో అవి క్రింద వివరింపబడినవి.
మూల అగ్నిపురాణము వహ్ని పురాణమను పేరుతోనే ప్రచారము నందినది. ఇందు అగ్ని మహిమ విస్తారముగా వివరింపబడినది. స్కందపురాణము శివరహస్య ఖండమున ఈ విషయమే చెప్పబడినది. ఈ లక్షణము వహ్నిపురాణము నందు మాత్రమే కాన్పించుట చేత ఇదియే మూల అగ్నిపురాణమని భావించుట సమంజసము,
ప్రస్తుత అగ్ని పురాణమందు తాంత్రికపూజ, కర్మ కాండలు విస్తారముగా వివరింపబడినవి. ఈ కారణము చేతనే బల్లాలసేనుడు తన గ్రంథమున ‘దానసాగరము’న దీనిని ప్రామాణికముగా తీసుకొనలేదు. ఆయన
తార్క్ష్య పురాణమపరం బ్రహ్మ మాగ్నేయ మేవచ
త్రయోవింశతి సాహస్రం పురాణమపి వైష్ణవమ్
షట్ సాహస్రమితి లింగం పురాణమపరం తథా
దీక్షా ప్రతిష్టా పాషండ ముక్తి రత్నపరీక్షణైః
వివిధ పురాణాలలో అగ్నిపురాణానికి అగ్ని, ఆగ్నేయ, అగ్ని ఉక్త, వహ్ని పురాణము మొదలైన పేర్లు చెప్పబడి ఉన్నాయి. ఈ అన్ని పేర్లు ఏకార్థక వాచకాలే. అందువలన ఒక పురాణానికే ఇవి వేరేవేరు పేర్లు అయి ఉండాలి. గరుడ, గారుడ, తార్క్ష్య, వైనతేయ, పురాణాలనేవి గరుడ పురాణానికి పేర్లు. ఇలాగే విష్ణువు, వైష్ణవాలనే పేర్లు విష్ణు పురాణానికి ఉన్నాయి. కానీ అగ్నిపురాణానికి వహ్నిపురాణమనే వేరొక వ్రాతప్రతి లభిస్తున్నది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అగ్ని పురాణానికి ఇది పూర్తి భిన్నంగా ఉన్నది.