6. స్త్రీ లక్షణ సద్వృత్త వర్ణనము

తా ॥ శతానీకుఁడిట్లనెను. దేవా! ఉత్తమాధమ మధ్యమ సంబంధముగా స్త్రీల సద్వృత్త లక్షణములను సవిస్తరముగా వినగోరుచున్నాను. సుమంతుఁడిట్లు సమాధానము చెప్పెను. మహా బాహూ! బ్రహ్మలోకమునందు బ్రహ్మదేవుఁడు మొదట స్త్రీ శరీర లక్షణములను చెప్పి పీదప సద్వృత్తమును కూడ చెప్పెను. కురునందనా! ఋషులు లోకానుగ్రహకాంక్షతో అడిగిన ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఇట్లు ఉత్తరము చెప్పెను. బ్రాహ్మణులారా! స్త్రీల సద్వృత్తముగూర్చి మొదటి నుండియు సవిస్తరముగా లోకానుగ్రహకాంక్షతోఁ జెప్పెదను వినుడు. గృహస్థాశ్రముల ధర్మార్థకామ ప్రాప్తి కొఱకు చెప్పుచున్నాను. మొదట యథాక్రమముగా సార్థమైన వేద విద్యను సంపాదించి విధి విహితముగా తగిన భార్యను పొందవలెను. పేదలకు గృహాశ్రమము గొప్ప విడంబనము. (మోసము). కాబట్టి గార్హస్థ్యమును కోరువాడు మొదట ధనమునార్జింపవలెను. ఇంటిలో భార్యాపుత్రులు ఆకలితో బాధపడుచుండగా చూచుటకంటే మనుష్యుడు తీవ్రమైన నరకబాధను సహించుట శ్రేష్ఠము. ఆఁకలి గొన్న శిశువు ఏడ్చుచుండుట చూచి ద్రవింపని హృదయము వజ్రమువలె కఠినమైనది. సాధ్వియైన ప్రియ భార్య చిరుగుబట్టలతో, ఆఁకలి వలన కృశించిన దేహముతో నుండుటను చూచుటతో సమానమైన దుఃఖము వేజు లేదు. కావున సమృద్ధి యుండుటయే సుఖము. ఆకలితో అలమటించువారు, దీనులై వెలవెలబోవుచున్నవారు నేల పై జాళ్ల పై పరుండువారునునైన భార్యా పుత్రులను నిస్సహాయముగ చూచుచుండుట కన్న అకార్యము మానవులకు మటియొకటి లేదు.

తా ॥ భుజము పై ఉత్తరీయము, ఆఁకలి కవులతో అలమటించు దీనమైన ముఖముగల కొడుకును చూచుచుండుట కంటె మనుష్యులకు మృత్యువే సుఖము నిచ్చును. జీవితమే పాపమగును. అట్లు అంగ లార్చెడు సంతానమును, దైన్యమునిండిన భార్య ముఖమును చూచి తట్టుకొనువారు వజ్ర శరీరులు. వారు వేయి విధములుగను సుఖమును పొందజాలరు. అందువలన ధనహీనుడు భార్యను పరిగ్రహించిన మాత్రమున అతనికి త్రివర్గ సంసిద్దియెక్కడిది? ఆమె అతనికి యాతన మాత్రమే యగును. భార్యలేని గృహస్థాశ్రమాధికారములేనట్లే ధనములేని గృహస్థాశ్రమాధికారమును లేదు. కొందఱు సంతానమే ధర్మార్థకామ సాధనమందురు. మఱి కొందఱు నీతి విదులు పురుషులకు ధనము, భార్య ఇవి రెండే త్రివర్గ ఫల సాధనములందురు. ఇష్టము పూర్తము అని ధర్మము రెండు విధములు. అందు మొదటిది భార్యతో సహా సాధించునది. రెండవది ధనముతో మాత్రమే సాధింపఁదగినదని తెలియవలెను. బంధువు తనవాఁడేయైనను దరిద్రుఁడైనచో లోకము అతనియెడ సిగ్గుపడును. కాని ధనవంతుఁడు పరుఁడైనను వానిని దగ్గరకుఁజేర్చుకొనును. దరిద్రుఁడు సమీపస్థుఁడైనను వానిని చూడరు. దూరస్థుఁడైనను ధనవంతుఁడైనచో వానిని భజింతురు. అందువలన మొట్టమొదట ధనమే సంపొదింపవలెను. అదియే త్రివర్గ సాధనకు, గుణములకు, గౌరవమునకు మూలము. ధనాఢ్యునితో విద్య, కులము, శీలము మొదలగు ఉత్తమగుణములనేకములు వచ్చిచేరును. నిర్థనునిలో అవి యున్నను నష్టమైపోవును.

తా ॥ శాస్త్రము, శిల్పము, కళలు మొదలగు కర్మలన్నియు ధనమువలన సాధింపదగినవి. ధనములు ధర్మాదుల వలన సాధింపదగినవి. సాధనములలో ధర్మార్థకామములు ముఖ్యములు. అవి సాధింపనివారి జీవితము అజాగళస్తనములవలె వ్యర్థమైనది. జన్మము మరణము కొఱకైనది మాత్రమే యగును. పూర్వ పుణ్యములచేత ధర్మకామాది హేతుజమైన విస్తృతమగు సంపదకలుగును. మఱల ధర్మముచేత పరలోక సుఖము కలుగును. సంపద చేత మఱల ధర్మకామములు సిద్ధించును. అట్లు ధనము, ధర్మకామములు పరస్పర కారణములు. ఒకటి మఱియొకదాని కారణమగుచు ఒక్కొక్కటి ఏక చక్రముగా చెప్పబడినది. కుడి యెడమలకే పై భాగము, క్రింది భాగము, మధ్యభాగములుండును. ఎవఁడు బుద్దిమంతుడై ఈ విషయమును తెలిసికొని త్రివర్గమును చక్కగా సేవించునో, వాఁడు అనేక విధములైన వివేచనములు గలవాఁడై ఉత్తరోత్తరములను పొందగలుగును. భార్య లేనివానికి గాని ధనములేని వానికి గానీ త్రివర్గమునందధికారములేదు, అందువలన భార్య కన్న ముందు ధనమునే సంపాదింపవలెను. వంశ క్రమానుగతములుగాని లేక స్వయముగ సంపాదించినవిగాని క్రియాయోగ్యములైన అర్థములు కలవాఁడే వివాహము చేసికొనవలెను. విద్య, విత్తము, ఆచారము మున్నగువానియందు సమానముగనున్న కులమునందు జన్మించిన అనిందిత చరిత్రగలది, మనోజ్ఞమైనది, ధర్మసాధనకు యోగ్యమైన దైన కన్యను వివాహమాడవలెను. భార్యను పొందనంతవఱకు పురుషుఁడు అర్ధపురుషుడు మాత్రమే. కాబట్టి సకాలమున శాస్త్ర విహితముగా పెండ్లాడవలెను. భార్యలేని పురుషుఁడు ఒకే చక్రముగల రథమువలె, ఒకే లెక్క గల పక్షివలె, సర్వకర్మలయందును అయోగ్యుఁడగును.

తా ॥ భార్యా స్వీకారముచేత ధర్మార్థములలో మిక్కిలి లాభము కలును. పరస్పరము ప్రీతి కలుగుటచేత కామరూప తృతీయ పురుషార్థము కూడా లాభించునని విద్యాంసులు చెప్పుదురు. హీనులతో, సమానులతో అధికులతో అని వివాహ సంబంధము మూడు విధములు. వీనిలో సమానులతో సంబంధమే ఉత్తమము. హీనులతో అథమము. అధికులతో మధ్యమము. హీనులచే నిందింపఁబడుదురు. అధికులచే అవమానింపఁబడుదురు. అందువలన సమానులతోడనే వివాహ సంబంధము ప్రశస్తమైనది. తమకన్న ఉన్నతులైన వారి సంబంధముచేసి అవమానములు పొందుదురు. అందుచే వీరికి లొంగియుండుటగాని, తమ కన్న అధముల సంబంధ మిష్టపడుటగాని తగనివి. అధిక, హీన సంబంధములు రెండును సమానముగ ఇబ్బంది పెట్టునవియే కావున వానిని నిందితములుగా విడువవలయును. బుద్ధిమంతులు విజాతి సంబంధమును ఇష్టపడరు. దాని వలన కోకిలతో చిలుక సంబంధమువలే రెండును భ్రష్టుమగును. అది కుల బాహ్యత్వము వలనను, తప్పక కలుగు అవమానముల వలనను, గౌరవమున హెచ్చుతగ్గుల వలనను ఉన్నతమైన సంబంధమైనను శ్రేష్ఠము కాదు. ఉత్తమాధమ సంబంధ విషయమున ఒక పక్షము వారు అన్యపక్షమును పరిహరించినచో, అన్యులు కూడ మొదటి పక్షము వారిని పరిహరింతురు. ఆ విధముగ రెండును పరస్పరము విడువబడును. ఒకే విధమైన యోగ్యతలతో, ఉపచారములతో పరస్పర స్నేహము ఎవరి మధ్య దీనదినము వృద్ధి చెందుచుండునో అట్టివారి మధ్య ఏర్పడునదే “సంబంధము' అని చెప్పఁబడును. ఎవరి మధ్య యాత్ర, ఆవాహ, నివాసదులతో పగసుగముగా సుగతో యోగంతలు మది చెందుచుండునో దాగి మగ గుండు.

తా ॥ ఆఫత్సంపదలలో ధన ప్రాణాదులచే నెవరి మధ్య సహ యోగిత్వ యోగ్యతలుండునో వారిది ఉత్తమమైన సంబంధము. మనుష్యులలో, స్నేహమును వ్యక్తీకరించుటయందు, చేసిన మేలును మరువకుండుట యందు, కష్ట సుఖములు వచ్చుటయే గీటుళ్లు. ప్రాయికముగ అట్టి స్నేహము. సమానులయందే కన్పట్టును. విత్తశీల కులాదులచేత నేర్పడు సామ్యము అంగీకరింపఁ దగినది. కాబట్టి అత్యంత సన్నిహితముగా నేర్పడు వివాహ సంబంధము, స్నేహము అనునవి సమానులతోనే చేయవలెను. తమ కన్న పై వారితోగాని క్రిందివారితోగాని చేయకూడదు.

ఇది శతార్థసాహస్ర్య సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమున బ్రహ్మ పర్వమునందలి స్త్రీ లక్షణ సద్వృత్త వర్ణనమను ఆఱవ అధ్యాయము.