6 - వహ్ని సృష్ట్యాది కధనము
పవమానుడు, పావుకుడు శుచి యను ముగ్గురు అగ్నిపుత్రులుగా జన్మించిరి. అరణిని ఉత్తరాణితో మథించినచో పుట్టువాడు-పవనుడగును. పావకుడు మెరపువలన జన్మించును. శుచియను వాడు సూర్యకిరణముల నుద్భవించును. ఈ ముగ్గురు స్వాహా దేవీ తనయులనుఁ బఱగుదురు. అగ్నిపుత్రులతో పౌత్రుల తోడను నలుబది తొమ్మండగురు అగ్నులు యజ్ఞములలో ఉపయోగింప బడుచున్నవి.
ఈ అగ్నులన్నియు తాపసులుగా, వ్రతనష్ఠులుగా ప్రజాపతులుగా రుద్రాత్మకులుగా గుర్తింపబడిరి. పితృదేవతలు యజ్ఞకర్తలు కానివారుగా యజమానులుగా ప్రేమభరిత మనస్కులుగా అగ్నిష్వాత్తాదులుగా బర్హిషదులుగా పరిగణింప బడినవారై -మేన-యను మానస కన్యను స్వధాదేవి యందు బడసిరి.
మేనకాదేవి-మైనాకుడు, క్రౌంచుడు అను కొమరులను’ ఉమను, శంకరుని అంగస్పర్శతో పవిత్రురాలైన గంగను హిమవంతుని వలన ప్రసవించెను.
శో॥ అసూత మేనా మైనాకం- క్రౌంచం తస్యానుజాముమాం । గంగాం హైమవతీం జజ్ఞే - భవాంగా శ్లేషపా వనీమ్ ॥
మరియు మేనకాదేవి యజ్ఞయాగములకు అధికరణమగు ధరణి యను మానస కన్యగూడ జన్మింప చేసెను. దివ్యపితరులు-అమృతపానముతో జరామరణ రహితులై యండువారు.
శో॥ దాక్షాయణీ సతీయా సా పార్శ్వం రుద్రస్య పార్వతీ ।
పశ్చాద్దక్షం వినింద్యైషా - పతింలేభే భవం తదా ॥
తాం ధ్యాత్వా వ్యసృజద్రుద్రా - ననేకా న్నీలలోహితః ॥
దక్ష ప్రజాపతి పుత్రిక యగు సతీదేవి - శివరహితమైన యజ్ఞము గాంచి దక్షుని తిరస్కరించి పార్వతిగా జన్మించి శంకరునే భర్తగా ఆశ్రయించెను. అట్టి సతీదేవిని తలచు కొనుచు పరమేశ్వరుడు అనేక రుద్రులను పుట్టించెను. వారు - రుద్రునితో సమానులు, సర్వలోక నమస్కృతులుగా నుండిరి. బ్రహ్మదేవుఁడు సృష్టిఁజేయుమని ప్రార్ధించి నందున అట్టహాసము జేయుచు అవలీలగా ఆత్మ సమానులను రుద్రుఁడు పుట్టింపగా - వారందరు పదునాలుగులోకములయందునిండియుండిరి.నిర్మలురు-నీలలోహితులు, జరామరణ వర్జితులునైయుండిరిఅట్టివారినివిధాతయవలోకించి “నమోఽస్తువో మహాదేవాః!” ఇత్యాది పదములనుతించిశంకరునకుసాష్టాంగముగనమస్కరించిప్రదక్షిణముజేసియు “మృత్యువు గలవారినిపుట్టించు”మనివేడుకొనెను.
అంత నీలలోహితుఁడు “అట్టి సృష్టిని నీవే యొనర్పు“ మని సెలవీయగా చతురాననుఁడు చరాచరము నంతయు జరామరణ సంయుక్తముగా సృజించెను. శంకరుఁడు రుద్రులందరికి అధిపతియై వారు తనకు లోబడియుండు నట్లు నియమించెను.
ఎట్టి విభాగము లేనట్టి అఖండ పరిపూర్ణుడగు శివుడు దివ్యాంతరిక్షమున స్థాణువై
సాక్షిమాత్రుడుఁనై యున్నను- తన ఇష్టముతో అనేక శరీర (రూప)ముల దాల్చుచుండును. భక్తులకాతడేసాక్షాత్కరించును.
శ్లో॥ శం రుద్రస్సర్వభూతానాం - కరోతి ఘృణయా యుతః । శంకర శ్చాప్రయత్నేన - తదాత్మా యోగ విద్యయా ॥
“రుద్రుఁడు ప్రాణుందరికి ఇహపర సుఖమును కరుణతో కలుగఁజేయువాడగుటచే
శంకరుఁడనఁబడును. అట్టి సుఖము మానవుని ప్రయత్నము వలన - లభించునది కాదు.
పరమేశ్వరునితో “శివోఽహం” అను తాదాత్మ్యముఁ జెంది శంకరు నారాధించుట పరాకాష్ఠ జెందిన భక్తి యోగమగును. ప్రాణాయామా ద్యష్టాంగ యోగాబ్యాసముతో శివదర్శనమగును. ”శం” అనగా విరక్తుని వైరాగ్యము వలన సంసార బంధ విముక్తి యగును.జీవాత్మదినక్రమముగాఇంద్రియసుఖములయందుఅభిరుచిని తగ్గించుకొనినచో సంసారముసుఖాంతముకాదనిభయపడినయెడలను వైరాగ్యము కలుగును. బ్రహ్మానంద ప్రాప్తి సూచనలు కనుపడగానే వైరాగ్యము స్థిరపడును. మరియు మానవుడు దుర్గుణములను విడనాడి సద్గుణముల నలవరచుకొని వైరాగ్యముతో చిత్తశుద్ధిని పొందినచో శివధ్యానము నభ్యసించుట - సిద్ధించును.
వేదశాస్తోక్తమగు వర్ణాశ్రమ ధర్మము, ఉపాసనాత్మకమగు జ్ఞానము-- వైరాగ్యము - ఈశ్వరభామము సమస్తంబు శివాను గ్రహము వలననే లభించును. ఇందుకు శ్రుతి ప్రమాణములు.
“న కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకేన అమృతత్వ మానశుః” “కర్మచేతగాని సంతానము వలన గాని ధనముతోగాని మోక్షము లభింపదు. కర్మఫలత్యాగముతోడనే జన్మరాహిత్యము సంభవించును.
“వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్న్యాసయోగా ద్యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే”
వేద వేదాంతార్థముతో “శివుడొకడే! భుక్తి ముక్తి ప్రదాత” యను నిశ్చయబుద్ధి గలవారు, కర్మ ఫలత్యాగము అను సన్న్యాసము నలవరచుకొనినవారు ఇంద్రియములను లోబలచుకొనిమనస్సునునియమించి చిత్తశుద్ధిని కలుగఁ జేసికొనిన వారు నగు శివోపాస కులందరు-పరమనగాప్రారబ్ధముఅద్దాని యవసానమున - అమృతుడగు శివుని యనుగ్రహము వలన ముక్తులై బ్రహ్మలోకము అనగా పరశివలోకమున శాశ్వత కాలము నివసింతురు.
శో॥ యే శంకరాశ్రితా స్సర్వే - ముచ్యంతే తేన సందయః । న గచ్ఛంత్యేవ నరకం - పాపిష్ఠా అపి - - దారుణమ్ ॥ ఆశ్రితాః శంకరం తస్మాత్ - ప్రాప్నువంతి చ శాశ్వతమ్ ॥
“శంకరు నాశ్రయించి శరణాగతులగు వారందరు ముక్తులగుడురు. ఇందెంత మాత్రము సంశయము లేదు. శివభక్తులు - పూర్వ జన్మ సంస్కారవశమున పాపాత్ములైనను-మరణానంతరము భయంకరమగు నరకమునఁ బ్రవేశింపరు. అందువలనశివునాశ్రయించిశాశ్వతమగుమహాకైలాసనివాసమును సంపాదింపవలెను.”\
శానకాదులు ఇట్లు ప్రశ్నించిరి. ఘోరము మొదలగు 28 కోట్ల నరకములలో పాపాత్ములు యాతనల ననుభవింతురనియు నీలలోహితుఁడు, సర్వభూతాశ్రయుఁడు, జగత్ర్పభువు,పురుషుడు,పరమాత్మయు, పురుహూత పురుష్టుతాది శబ్ద వాచ్యుఁడు నగు శంకరునారాధింపనివారు--నరకప్రవిష్టులగుదురనియు, సత్త్వ రజ స్తమో గుణములతో విష్ణుబ్రహ్మరుద్రరూపములదాల్చువాడగుపరమేశ్వరుడు త్రిమూర్తులకు మూల పురుషుఁడనియుభావించుచున్నాము.
ఐతే ఎట్టివారు నరకము నొందరు? ఎట్టి వారు నరకములలో పడుదురు? మోక్షప్రాప్తికర్మచేతనా?జ్ఞానమువలననా?
ఇయ్యది - శివ విజ్ఞానవీచిక - యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (6) షష్ఠాధ్యాయము.